tsunami mock
సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కందుకూరు ఆర్‌డీఓ మల్లికార్జునరావు అన్నారు.
పాకల: సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కందుకూరు ఆర్‌డీఓ మల్లికార్జునరావు అన్నారు. పాకల పల్లెపాలెంలో బుధవారం సునామీ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బి.వి.ఎస్. రాం ప్రకాష్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు.
సముద్రంలో మునిగిన వ్యక్తిని ఏవిధంగా బయటకు తీసుకుని వచ్చి కాపాడాలో అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్ చేశారు. మత్స్యశాఖ ఏడీఈ షేక్ లాల్‌మహమ్మద్, కొండపి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్ , జిల్లా సమగ్ర వ్యాధి నివారణ అధికారి డాక్టర్ పి. పుల్లారెడ్డి, సీఐ భీమానాయక్, ఎస్సె›్త వైవి రమణయ్య, మండల స్పెషల్‌ఆఫీసర్ జెన్నమ్మ, తహసీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్, ఎంపిడిఓ షేక్ జమీఉల్లా, మండల ఇరిగేషన్ ఏఇ విజయలక్ష్మి, పంచాయితిరాజ్ ఏఇ శ్రీహరి, రెడ్‌క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ కోటయ్య, పంచాయితి కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.
– పాకల తీరంలోమాక్ డ్రిల్