గాజులరామారం: డివిజన్ పరిధిలోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా సంస్థ(ఇన్ కాయిస్)లో బుధవారం ఐఓ వేవ్-16 పేరిట సునామీ మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ కొనసాగనుంది. డ్రిల్ లో భాగంగా శాస్త్రవేత్తలు సముద్ర భూగర్భంలో పలుమార్లు కృత్రిమ భూకంపాలు సృష్టించారు. మొదటిరోజు 9.2 తీవ్రతతో ఇండోనేసియా, సుమత్రా దీవుల్లో భూకంపం సంభవిస్తే కలిగే దుష్ర్పభావాలపై డ్రిల్ ను నిర్వహించారు. అటువంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.