జకార్తా: దక్షిణ మధ్య ఇండోనేసియా సమీపంలోని సముద్ర గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0 గా నమోదు అయింది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి లేదని తెలిపింది. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 547 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభించిందని పేర్కొంది.