గత కొన్ని రోజులుగా జపాన్ వాసులను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమ జపాన్ ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైందని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సంభవించిన భూకంపాల వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిదని వారు వాపోతున్నారు.