
సునామీ వచ్చినా షేక్ కాదు...
ఈ విషయం దీన్ని రూపొందించిన అమెరికా డిజైనర్ డాన్ నెల్సన్ చెబుతున్నారు. అందుకే ఈ ఇంటికి సునామీ హౌస్ అని పేరు పెట్టారు. అమెరికాలోని కమానో ద్వీపంలో సముద్రమట్టానికి 9 అడుగుల ఎత్తులో దీన్ని కట్టారు. పిల్లర్లకు సపోర్ట్‌గా పైన అంతా స్టీల్ ఫ్రేమ్స్ వేశారు. పిల్లర్ల మధ్య భాగమంతా అద్దాలతో నిండి ఉంటుంది. అవి.. వరద తాకగానే బద్దలైపోతాయన్నమాట. అందుకే రెండంతస్తుల భవనంలోని కింద ఫ్లోర్‌కు ఫ్లడ్ రూం అని పేరుపెట్టారు. అంటే.. సునామీ వచ్చినప్పుడు సముద్రపు నీరు ఈ కింద భాగాన్ని తాకినప్పుడు ఇటు వైపు అద్దాలు బద్దలై.. నీరు అటు వైపు నుంచి బయటకు పోతుంది. భవనానికి ఏమాత్రం నష్టం కలగదు. జనం పై భాగంలోకి సురక్షితంగా ఉండొచ్చు. ఇది ఒక్క సునామీనే కాదు.. భూకంపాలనూ తట్టుకుంటుందట!