
పెరూ : దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పుక్వికో పట్టణానికి ఈశాన్యంలో 124 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు సునామీ హెచ్చరికను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment