
రష్యాలో భారీ భూకంపం
- ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
- సునామీ హెచ్చరికలు జారీ చేసిన రష్యా ప్రభుత్వం
బేరింగ్ ఐలాండ్: రష్యాలోని బేరింగ్ ఐలాండ్ సముద్రతీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నయోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం.. కొద్ది క్షణాల్లోనే 7.8 తీవ్రతకు చేరుకుందని తెలిపాయి. సముద్రంలో పది కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పాయి.
అయితే, నికోల్‌కోయ్ నగరానికి తీరం 200 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో భారీ నష్టం తప్పిందని పేర్కొన్నాయి. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించొచ్చని సునామీ హెచ్చరికల కేంద్ర అలర్ట్ జారీ చేసినట్లు తెలిపాయి. న్యూజిలాండ్‌పై భూకంప ప్రభావం ఏమి ఉండకపోవచ్చని చెప్పాయి.