శ్రీలంకతో పాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలోని చాలా భాగంలో త్వరలోనే భారీ భూకంపాలు, పెద్దపెద్ద సునామీలు రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకతో పాటు హిందూ మహా సముద్ర ప్రాంతంలోని చాలా భాగంలో త్వరలోనే భారీ భూకంపాలు, పెద్దపెద్ద సునామీలు రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2004లో సుమత్రాలో 9.2 తీవ్రతతో వచ్చిన వాటికంటే కూడా ఎక్కువ స్థాయిలో రావచ్చని అంటున్నారు. అప్పట్లో వచ్చిన సునామీ కారణంగా దాదాపు రెండు లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే.
శ్రీలంలో చాలాభాగం హిందూ మహాసముద్రంలోనే ఉంటుంది. ఇక్కడ తరచు భారీ భూకంపాలు వస్తుంటాయి. 22 ప్రాంతాల్లో నమూనాలను సేకరించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ రానంత తీవ్రతతో ఈసారి సునామీ వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మియామీకి చెందిన శాస్త్రవేత్త ఫాక్ అమెలంగ్ తెలిపారు.