ఆత్మలతో ఫోన్‌లో మాట్లాడాలని ఉందా!
టోక్యో: ఫోన్ కనెక్షన్ బాగుంటే సాధారణంగా మన కుటుంబసభ్యులకు, స్నేహితులు, ఇతర సన్నిహితులకు కాల్ చేసి మాట్లాడుతుంటాం. పరస్పరం క్షేమ సమాచారాన్ని, ఇతర విషయాలను చర్చించుకుంటారు. అయితే ఆత్మలకు (చనిపోయిన వ్యక్తులకు) ఫోన్ చేసి వారితో మాట్లాడాలని ఎప్పుడైనా అనుకున్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి ఆలోచన ఒకటి వెలుగుచూసింది. జపాన్ లోని ఓట్సుచి నగరంలో ఓ టెలిఫోన్ బూత్ ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని రోజుల్లో పర్యాటక కేంద్రంగానూ మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జపాన్ దేశాన్ని 2011లో వచ్చిన పెను విషాధం సునామీ చాలా కుటుంబాలలో కన్నీరు మిగిల్చించి. ఇక్కడి ఓట్సుచి పట్టణంలో సునామీ వల్ల 16 వేల మందికి పైగా స్థానికులు మృతిచెందారు. అప్పటినుంచీ తమ కుటుంబసభ్యులు, బంధువులు, ఇతర సన్నిహితుల లేని లోటును పూడ్చుకోలేక వీరు ఎంతో బాధపడుతున్నారు. ఇటారు ససాకి అనే వ్యక్తి ఆ సునామీలో తన సోదరుడిని కోల్పోయాడు. అతడిని తలుచుకుని ఎప్పుడూ ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో అతడికి ఓ వింత ఆలోచన వచ్చింది. తన ఇంటి గార్డెన్‌లో చుట్టూ అద్దాలతో ఇటారు ససాకి ఓ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేశాడు. ఇందులో కనెక్షన్ సదుపాయం లేని ఓ ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేశాడు.
తన సోదరుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ బూత్‌కు వచ్చి మొబైల్ నెంబర్ కు డయల్ చేసి చనిపోయిన సోదరుడి (ఆత్మ)తో మాట్లాడున్నట్లు.. తన బాధను పంచుకున్నట్లు, అతడు తనకు సమీపంలోనే ఉన్నట్లు భావించేవాడు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించింది. కొన్ని రోజుల కిందట ఏర్పాటు చేసిన ఈ బూత్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. 10 వేలకు పైగా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. నేరుగా ఈ బూత్ వద్దకు వచ్చి తాము ప్రేమించిన వారితో, సన్నిహితులతో కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఫీలవుతూ రిలాక్స్ అవుతున్నారు. ససాకీ ప్రతిరోజు ఈ బూత్‌ను, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసిన తర్వాతే తన పనిని స్టార్ట్ చేస్తుంటాడు. కొందరైతే ప్రతిరోజు రెండుసార్లు ఆత్మలకు ఫోన్ చేసేందుకు వస్తుంటారని సమాచారం.