ఇనార్‌సూట్, గ్రీన్‌లాండ్ : కేవలం 170 మంది జనాభా కలిగిన గ్రీన్‌లాండ్‌లోని ఇనార్‌సూట్ గ్రామం సునామీ భయంతో వణికిపోతోంది. ఇందుకు కారణం దాదాపు 100 మీటర్లు(330 అడుగులు) ఎత్తైన భారీ మంచుకొండ సదరు గ్రామాన్ని సమీపిస్తుండటం. దాని నుంచి మంచు చరియ గనుక విరిగితే భారీ ఎత్తున అలలు గ్రామంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.
దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం ఈ తరహా భారీ మంచు తునకలు గ్రామానికి సమీపంలో కనిపించడం కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో దీని కంటే అతి పెద్ద మంచు చరియలు అటువైపుగా పయనించాయని వెల్లడించారు. మంచు చరియకు భారీ స్థాయిలో పగుళ్లు ఉండటమే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే స్టేషన్, ఇంధన వనరు ప్రదేశం తీరానికి అతి చేరువలో ఉన్నాయి. మంచు చరియ దాదాపు కోటి 10 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. నీటిపై భాగంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంచుకొండ ఉంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న మంచు ముక్కలు విరిగి నీళ్లలో పడిన శబ్దాలు సైతం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment