ఆక్లాండ్: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి తూర్పుగా భూకంపం సంభవించినట్లు పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) వెల్లడించింది. అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రారంభంలో ఈ భూకంపం తీవ్రతను 7.3గా పేర్కొన్నది.. ఆ తరువాత దానిని 6.9కి సవరించింది. 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ తెలిపింది.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
చదవండి: ఊగిపోయిన రాహుల్ గాంధీ గది!
Comments
Please login to add a commentAdd a comment