
సియోల్: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్‌వాటర్ డ్రోన్‌ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్ హెయిల్–2ను శుక్రవారం తీర నగరం టంచోన్ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది.
నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది.