న్యూజిలాండ్లోనూ సునామీ హెచ్చరికలు
వెల్లింగ్టన్: చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ దాని పక్కనే ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది. చిలీ భూకంపం వల్ల న్యూజిలాండ్లో ఉన్న సముద్ర తీరంలో కూడా రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత వాసులు తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లాలని, వారిని సురక్షిత ప్రాంతాల తరలింపు చర్యలకు దిగాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. నదులపక్కకు, జల పాతల వద్దకు ఎవరూ వెళ్లకూడదని, పడవ ప్రయాణాలు, బోటింగ్ వంటివాటిని పూర్తిగా నిషేధించాలని పకడ్బందీ అదేశాలు జారీ చేసింది.
చిలీలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.3గా నమోదైన ఈ భూకంప కేంద్ర సముద్రంలో కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ తీరమంతటా సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా వాల్పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ సైరన్ మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.