శాంతా క్లారా(కాలిఫోర్నియా): కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా శుభారంభం చేసింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం(భారత కాలమాన ప్రకారం) జరిగిన పోరులో అర్జెంటీనా 2-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చిలీకి షాకిచ్చింది. గతేడాది జరిగిన ఫైనల్లో పోరులో చిలీ చేతిలో ఓటమి పాలైన అర్జెంటీనా అందుకు బదులు తీర్చుకుంది.
ఆట రెండో అర్థభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి చిలీకి షాకిచ్చింది. ఆట 54వ నిమిషంలో ఏంజెల్ డి మారియా, 59వ నిమిషంలో బనేగా తలో గోల్ చేసి అర్జెంటీనా విజయానికి సహకరించారు. కాగా ఆట చివరిలో చిలీ గోల్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం వరల్డ్ టాప్ ర్యాంకులో ఉన్న అర్జెంటీనా కోపా అమెరికా కప్ను 14 సార్లు గెలవగా, 2015లో సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నమెంట్లో మాత్రమే చిలీ విజేతగా నిలిచింది.