
చిలీ సంచలన విజయం
గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్లో చిలీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఫేవరేట్ అర్జెంటీనా మరో సారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్ సమరంలో చిలీ పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై సంచలన విజయం సాధించింది.
ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా నిర్ణీత సమయంలోపు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్లో చిలీ నాలుగు గోల్స్ చేయగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రెండు గోల్స్ మాత్రమే చేయలగలిగింది. విజేత చిలీకి 25.37 కోట్ల రూపాయలు, రన్నరప్ అర్జెంటీనాకు 19 కోట్లు ప్రైజ్మనీ దక్కింది. గతేడాది కూడా కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ పెనాల్టీ షూటౌట్లోనే అర్జెంటీనాను ఓడించింది.