వాషింగ్టన్(చిలి): దక్షిణ అమెరికాలో మాంసాహార సముద్ర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సీ లయన్స్ వలస బాట పట్టాయి. దాదాపు 300 సీ లయన్స్ టోమ్‌కు సమీపంలో చిలీ పట్టణంలోని బయో బయో ప్రాంతంలో సేద తీరుతున్నాయి. అయితే ఈ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఓ విలేకరి స్థానికంగా ఉండే మత్స్యకారుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సీ లయన్‌కి కోపం వచ్చిందో.. ఏమో గానీ.. గేటు తీసుకుని వారి పై దాడి చేయడానికి ప్రయత్నించిది. బయటకు వచ్చి వాళ్లని దూరంగా తరిమింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నా(సీ లయన్) గురించి కావాలంటే నన్ను అడుగకుండా.. వేరెవరినో అడుగుతావా.. ఎంత ధైర్యం.’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటి?’’ అంటూ రాసుకొచ్చారు.
A "plague of sea lions" has hit a town in the Bio Bio region of Chile, possibly fleeing predators like orcashttps://t.co/MUS0jahzyU
— 🌎Animal Watch🌍 (@Animal_Watch) June 25, 2021
RT @BBCWorld pic.twitter.com/3kpDh4yjqg
Comments
Please login to add a commentAdd a comment