భూపాతం ధాటికి నాశనమైన దక్షిణ చిలీలోని విల్లా శాంటా లూసియా గ్రామం
చిలీ : భారీ భూపాతం ధాటికి దక్షిణ చిలీలోని ఓ కుగ్రామం నాశనమైంది. కొర్కొవాడో జాతీయ పార్క్‌కు చేరువలో ఉన్న విల్లా శాంటా లూసియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం అర్థరాత్రి వరకూ భారీగా వర్షం కురవడంతో భూపాతం సంభవించినట్లు తెలుస్తోంది.
భూపాతం ధాటికి గ్రామంలోని రోడ్లు, పాఠశాల, ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లైతే పూర్తిగా నాశనమయ్యాయి. లూసియా గ్రామాన్ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment