mud slide
-
కొండ చరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయి 14 మంది మృతి
Mudslide In Western Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురదనీరు చేరడంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చరియాలు విరిగిపడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండచరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అయ్యో జగదీశ్ ! చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావే!!) -
బురదచరియలు విరిగిపడి క్షణాల్లో నేలమట్టం; వీడియో వైరల్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఓ పట్టణంలో భారీ వర్షాల కారణంగా శనివారం ఒక్కసారిగా బురద, చెత్తాచెదారంతో కూడిన వరద ఇళ్లపైకి దూసుకురావడంతో కనీసం 19 మంది గల్లంతయ్యారు. షిజుఓకా ప్రిఫెక్చర్లోని రిసార్ట్ ప్రాంతమైన అటామీలో సుమారు 80 ఇళ్లు పూర్తిగా బురద చరియల్లో సమాధి అయినట్లు అధికారులు తెలిపారు. ఓ వంతెన కూడా కొట్టుకుపోయిం దన్నారు. సుమారు 100 మంది గల్లంతై ఉంటారని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. షిజుఓకా ప్రిఫెక్చర్లో 19 మంది వరకు జాడ తెలియకుండా పోయినట్లు అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, ఈ సంఖ్య పెరగవచ్చని ఆయన అన్నారు. వారం రోజులుగా జపాన్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. -
భారీ భూపాతం.. ధ్వంసమైన గ్రామం
చిలీ : భారీ భూపాతం ధాటికి దక్షిణ చిలీలోని ఓ కుగ్రామం నాశనమైంది. కొర్కొవాడో జాతీయ పార్క్కు చేరువలో ఉన్న విల్లా శాంటా లూసియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం అర్థరాత్రి వరకూ భారీగా వర్షం కురవడంతో భూపాతం సంభవించినట్లు తెలుస్తోంది. భూపాతం ధాటికి గ్రామంలోని రోడ్లు, పాఠశాల, ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లైతే పూర్తిగా నాశనమయ్యాయి. లూసియా గ్రామాన్ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
రాజధానిపై వరద ప్రకోపం, 312 మంది మృతి
ఫ్రీటౌన్: సియర్రా లియోన్ పేదరికంతో కొట్టుమిట్టాడే ఓ ఆఫ్రికన్ దేశం. దీని రాజధాని ఫ్రీటౌన్. దేశ ఆర్థిక ప్రగతి మొత్తం రాజధానిలోనే కేంద్రీకృతం కావడంతో దాదాపు 12 లక్షల మంది జనాభాతో ఫ్రీటౌన్ కిక్కిరిసి ఉంటుంది. అలాంటి నగరంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపింది. చిక్కిపోయిన దేహాలతో ఉండే సగటు ఫ్రీటౌన్ వాసి ప్రాణాలను అరచేత పట్టుకుని, ఇళ్లను వదిలి కొండలను ఎక్కాల్సిన పరిస్థితిని కల్పించింది. సోమవారం ఫ్రీటౌన్పైకి దూసుకొచ్చిన రాకాసి వరద 312 మందిని పొట్టన పెట్టుకుంది. భారీ మొత్తంలో వచ్చిన వరద నీటితో పాటు పెద్ద ఎత్తున వచ్చిన ఎర్ర మట్టి ప్రజల పాలిట శాపంగా మారింది. ఒట్టి వరదైతే తప్పించుకోవడానికి కొంత సులువుగా ఉండేది. కానీ, నీటితో పాటు వచ్చిన మట్టి మనుషులను చుట్టేసి తనలో కలిపేసుకుంది. నగరంలోని ఏ వీధిని చూసిన నిశ్శబ్దం. కుప్పలు తెప్పలుగా పడివున్న శవాలు. వీటన్నింటిని చూసిన పత్రికా విలేకరికి కన్నీళ్లు ఆగలేదు. సగానికి పైగా తెగిపోయిన మనుషుల శరీరాల నుంచి బయటకు వస్తున్న ఎర్రమట్టి ఆయన్ను అక్కడే కూలబడిపోయేలా చేసింది. ఆ హృదయ విదారక సన్నివేశాలను కెమెరాలో బంధించి సోషల్మీడియాలో సాయం కోసం పోస్టు చేశారు. వేల సంఖ్యలో సహాయకులు అవసరమని ఫ్రీటౌన్ ప్రజలను కాపాడాలని అభ్యర్థించారు. వరద వల్ల దాదాపు 2000లకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నగరానికి చేరువలోని పర్వతాలపైకి ఎక్కిన కొందరు ప్రాణాలను రక్షించుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే వందల సంఖ్యలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.