చీలీలో భారీ భూకంపం, రిక్టర్ పై 6.4గా నమోదు! | Strong 6.4-magnitude quake jolts central Chile: USGS | Sakshi
Sakshi News home page

చీలీలో భారీ భూకంపం, రిక్టర్ పై 6.4గా నమోదు!

Published Sun, Aug 24 2014 10:22 AM | Last Updated on Fri, Aug 24 2018 7:34 PM

Strong 6.4-magnitude quake jolts central Chile: USGS

శాంటియాగో: చీలీ దేశంలో భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 శాతంగా నమోదైంది. చీలీ రాజధాని శాంటియాగో ఆగ్నేయ ప్రాంతానికి 67 మైళ్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 
 
శాంటియాగోతోపాటు మరో ఐదు ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఉందని ఆదేశ జాతీయ అత్యవసర సంస్థ తెలిపింది. శాంటియాగో రాజధానిని ప్రకంపనలు సుమారు 40 సెకన్లపాటు కుదిపేసాయని అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement