Published
Sun, Dec 25 2016 8:22 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు.
దక్షిణ చిలీలోని తారాహుయిన్లో భూకంప దాటికి పాడైన రోడ్డు