Tsunami Warning
-
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్‌లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో జపాన్ పశ్చిమ తీరంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Tsunami waves are flowing back up the river in Noto, Ishikawa japan#Japan #earthquakes #EarthwuakeInJapan pic.twitter.com/2MKF7u7U7i — Ritesh Kumar (@riteshkumar1926) January 1, 2024 భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్‌లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు. హొకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. Store Owner records his store shake after 7.4 m earthquake hit Japan Tsunami warning is in Effect#Japan #tsunami #warning #deprem #sismo #地震 #earthquake #japanese #japannews pic.twitter.com/KJxlv0j1ii — Hollow dreams (@ChrisKolen001) January 1, 2024 మార్చి 11, 2011న, జపాన్‌లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్‌లో అణు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: Happy New Year: 2024.. దునియాలో కొత్తగా జరగనుంది? -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్‌లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
అలస్కాలో భూకంపం: సునామీ వార్నింగ్
వాషింగ్టన్: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీంతో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది (మెక్సికోలో భారీ భూకంపం) చదవండి: 7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేసియాను భూకంపం వణికించింది. సులావేసి దీవిలో శుక్రవారం సంభవించిన ప్రకంపనలకు పలు ఇళ్లు కూలిపోగా, ఒకరు చనిపోయినట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం సులావేసి పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు కొంతసేపటికి విరమించుకున్నారు. పాలూ అనే పట్టణంలో నీటి ఉధృతికి పలు భవనాలు కుప్పకూలాయి. సముద్ర అలలు సుమారు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగిశాయని విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. సునామీ అలలకు భయపడి స్థానికులు ఎత్తయిన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. భూకంప కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రజలు ప్రకంపనలు తమ నివాసాల్లోనూ వచ్చినట్లు తెలిపారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలు, రాళ్లు రహదారులపైకి కొట్టుకొచ్చాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాహనాల్లో ఎగువ ప్రాంతాల వైపు బయల్దేరడంతో పాలూ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి సహాయక బృందాలు చేరుకుంటున్నారు. ప్రకంపనల ధాటికి ఎంతమంది చనిపోయారు? ఎందరు గాయాలపాలయ్యారు? అన్న సమాచారం తెలియరాలేదు. -
భారీ భూకంపం.. కుదేలైన ‘ఇండోనేషియా’
-
ఇండోనేషియాలో భారీ భూకంపం..
-
భారీ భూకంపం.. 80 మంది మృతి
జకార్త : ఇండోనేషియా లంబోక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0 శాతంగా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటుల స్పల్ప భూప్రకంపనలు కొనసాగాయి. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందాలాది ఇళ్లు ధ్వంసంకాగా, వేలాది ప్రజలు నిరాశ్రలయ్యరు. కాగా భారీ భూకంప హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఆదివారమే సునామీ హెచ్చరికల్ని జారీచేసిన విషయం తెలిసిందే. పసిఫిస్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే. -
ఇండోనేసియాలో భారీ భూకంపం
మతరమ్: ఇండోనేసియాలోని లంబోక్ దీవిని ఆదివారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దెబ్బకు లంబోక్‌లో 39 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. తొలుత భారీ తీవ్రతతో, అనంతరం కొంచెం తక్కువ తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటు స్వల్ప భూప్రకంపనలు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రతకు పక్కనే ఉన్న బాలిలోని భవనాలు కంపించాయి. ట్రెక్కింగ్ కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీచేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంప కేంద్రం లంబోక్ భూగర్భంలో 10 కి.మీ లోతున ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
-
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
మనీలా: ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావం వల్ల పలు భవంతులు దెబ్బతినగా, ఇద్దరు గాయపడ్డారు. ప్రభుత్వ భవనాలు బీటలుబారాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మిండనావో ద్వీపంలో 41 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. జనం నిద్రపోతున్న సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయంతో నిద్రలేచి, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు హడావుడిగా బయటకు వెళ్లే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ నెల 12న మిండనావోలోనే సంభవించిన భూకంపంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో మిండనావోలోని సురిగావోలో వచ్చిన భూకంపం వల్ల ఎనిమిదిమంది మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు. దక్షిణ చిలీలోని తారాహుయిన్లో భూకంప దాటికి పాడైన రోడ్డు -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల వద్ద సముద్ర గర్భంలో శనివారం ఉదయం 10:31 గంటలకు భారీ భూకంపం సంభవించింది. కోటా టెర్నెట్ ప్రాంతానికి 154 కి.మీ. దూరంలో 46 కి.మీ. లోతులో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవు
-
భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవు: ఇన్కాయిస్
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో భారీ భూకంపం నేపథ్యంలో భారత్‌కు ప్రస్తుతం సునామీ హెచ్చరికలు లేవని ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ నేషనల్ సెంటర్(ఇన్కాయిస్) వెల్లడించింది. భారత్‌కు చాలా దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇండోనేషియా మలుకు దీవుల్లో శనివారం భారీ భుకంపం సంభవించిన విషయం తెలిసిందే. సముద్రంలో 46 కి.మీ. లోతులో ఏర్పడ్డ ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.3గా నమోదైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. అయితే భూకంప తీవ్రతతో ప్రజలు ఒక్కసారిగా భయపడి....ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక
జకర్తా: ఇండోనేసియా సముద్ర జలాల్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. శనివారం ఉదయం తూర్పు ఇండోనేసియా మలూకు ద్వీపాలు కంపించాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో 46 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇండోనేసియాతో పాటు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా భూకంప కేంద్రం భారత్‌కు చాలా దూరంలో ఉందని ఇన్కాయిస్ వెల్లడించింది. భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవని పేర్కొంది. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం వల్ల ఆగ్నేయాసియా దేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. 1.70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
విజ్ఞాన ఖని.. భాగ్యనగరం
ఇప్పటికే అనేక రంగాల్లో తనదైన గుర్తింపును తెచ్చుకున్న భాగ్యనగరం నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలున్న యువతకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రపంచస్థాయి పరిశోధనలకు కేంద్రంగా ఎదుగుతోంది. నాలెడ్జ్ హబ్ దిశగా ప్రస్థానం కొనసాగిస్తున్న హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పరిశోధనలు, ఇంటర్న్‌షిప్-ఫెలోషిప్ అవకాశాలపై ఫోకస్... పరిశోధన ల్లో మేటి.. సిటీ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ).. బెంగళూరు, ముంబై నగరాల తర్వాత అత్యధికంగా నిధులు అందజేసేది హైదరాబాద్ నగరానికే. ఇక్కడ దాదాపు 100 ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ), సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏనిమల్ బయోటెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ వంటి సంస్థల్లో నిత్యం వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తుంటారు. వీటిల్లో మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నారు. వీటితోపాటు ట్రిపుల్ ఐటీ, ఐఐటీలలో అకడమిక్స్‌తోపాటు పరిశోధనల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్(ఐ.ఎల్.ఎస్) ఉంది. ఇక్కడ క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, మెటబాలిక్ డిజార్డర్స్ తదితర వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. సిటీ అమ్ములపొదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఘన చరిత్ర ఉంది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బోటనీ తదితర అంశాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీతో పోటీపడేందుకు ధీటుగా యువతలో పరిశోధనలపట్ల ఆసక్తి పెంచేందుకు ‘నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ (ఎన్‌కేఎన్)’ తోడ్పాటును అందిస్తోంది. సైన్స్, టెక్నాలజీ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ తదితర అంశాల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలకు చేయూతనిస్తుంది. ఎన్‌కేఎన్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలున్నాయి. పరిశోధనలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. సునామీ హెచ్చరికల నుంచి తోకచుక్కల గమనం వరకు.. భౌగోళికంగా హైదరాబాద్‌కు గల ప్రత్యేక స్థానం.. ప్రయోగశాలలు, పరిశోధకులకు అనువుగా ఉంటోంది. ఆ ప్రత్యేకతే.. యువతను సాంకేతిక పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటరమణ. సముద్రతీరం లేకపోయినా సునామీ హెచ్చరికల కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఉండటం భౌగోళికంగా కలిసొచ్చే ప్రాధాన్యత అంటారాయన. వాతావరణాన్ని, సముద్రాలను అధ్యయనం చేసి తుపానులు, సునామీ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి నగరంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్) ఏర్పాటైంది. అదేవిధంగా అంతరిక్షంలో ఆవిష్కృతమవుతున్న వింతలను.. తోకచుక్కల గమనాన్ని కనిపెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా బేగంపేటలో 1908లో నిజాం అబ్జర్వేటరీ ఏర్పాటైంది. విద్యార్థుల్లో పరిశోధనలకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అబ్జర్వేటరీ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఎన్.హసన్ తెలిపారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనలను తెలుసుకోవాలంటే ఇంగ్లిష్ అవసరమనేది హసన్ అభిప్రాయం. ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు - ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్‌సీఐ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఏటా 60 మంది విద్యార్థులకు సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రాం (ఎస్.ఆర్.పి)లో శిక్షణ ఇస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధనల పట్ల ఆకర్షితులయ్యేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుందని వివరించారు ఏఆర్‌సీఐ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ జి.పద్మనాభం. వేసవిలో నిర్వహించే ఇంటర్న్‌షిప్‌కు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ విద్యార్థులు అర్హులు. ఇక్కడ సీనియర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. - మరో ప్రముఖ పరిశోధన సంస్థ సీసీఎంబీ ప్రతిఏటా వేసవిలో దేశంలోని పరిశోధన, విద్యాసంస్థల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. ఎమ్మెస్సీ, బీటెక్ విద్యార్ధులకు 60 రోజుల శిక్షణలో సైంటిఫిక్, క్లాసురూం పాఠ్యాంశాలుంటాయి. తర్వాత విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశంపై ప్రాజెక్టు రిపోర్టు అందజేయాల్సి ఉంటుంది. - ఇవేకాకుండా దాదాపు అన్ని పరిశోధన సంస్థలు జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు అందిస్తూ పరిశోధకుల మెప్పు పొందుతున్నాయి. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతున్నాయి. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటే ఉన్నతమైన కెరీర్ ‘‘గతంతో పోల్చితే మేధోవలసలు తగ్గుతున్నాయి. దేశంలోనే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనలకు భారీస్థాయిలో నిధులు కేటాయిస్తోంది. దీంతో పరిశోధన రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం ద్వారానే కెరీర్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు’’ - డాక్టర్ కళాచంద్సేన్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ సీ++ నుంచి ఆకాశ్ వరకు.. జావా.. సీ, సీ++, లైనక్స్, ఎస్‌క్యూఎల్ సర్వర్, యానిమేషన్, మల్టీమీడియా వంటి కోర్సుల శిక్షణ నుంచి చంద్రయాన్-1కు అవసరమైన మేధో పరిజ్ఞానం అందించేంత అవకాశాలు హైదరాబాద్ సొంతం. కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా.. సోషల్‌సెన్సైస్, లా, హ్యుమానిటీస్, ఫారెన్ లాంగ్వేజెస్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ, సెన్సైస్.. ఇలా అన్ని విభాగాల్లో నగరం దేశంలోనే తనదైన ముద్ర వేసుకుంది. సృజనాత్మకత, నూతన ఆలోచనలతో వచ్చే యువతకు సిటీలో అనేక అవకాశాలున్నాయి. కొన్నేళ్లుగా నగరంలో పెరుగుతున్న స్టార్ట్అప్లే ఇందుకు నిదర్శనం. కొత్త కంపెనీని ఏర్పాటు చేసి.. పదిమందికి ఉపాధి కల్పించాలనుకునేవారికి సిటీలో అనేక సంస్థలు అవసరమైన గెడైన్స్, సీడ్ ఫండింగ్ అందిస్తున్నాయి. వాటిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వంటివి ముఖ్యమైనవి. ముఖ్యమైన వెబ్‌సైట్స్: www.acsir.res.in, www.ngri.org.in, www.drdo.gov.in, www.ccmb.res.in, dbtindia.nic.in, dst.gov.in, ninindia.org -
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
చిలీ తీరాన్ని భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. దీంతో ఒమత్తం లాటిన్ అమెరికా పసిఫిక్ తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి భూకంపం, సునామీ వల్ల నష్టాలు జరిగినట్లు ఇంకా ఏమీ తెలియరాలేదు. ఎల్క్విక్ గనుల ప్రాంతానికి 86 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన ఈ భూకంపం సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన మాత్రమే ఉంది. దాంతో ఇది చాలా బలంగా ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ప్రపంచంలోనే భూకంపాలు అత్యంత ఎక్కువగా వచ్చే దేశాల్లో దక్షిణ అమెరికా దేశమైన చిలీ ఒకటి. దీనికి ఉత్తరాన పెరూ, ఈశాన్యంలో బొలీవియా, తూర్పున అర్జెంటీనా ఉన్నాయి. సునామీ ప్రమాదం పొంచి ఉండటంతో చిలీ అధికారులు టీవీ చానళ్ల ద్వారా ప్రచారం చేసి, తీరప్రాంతాల వాసులను వెంటనే ఖాళీ చేయించారు. పెరూ, ఈక్వెడార్, కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా దేశాల్లోని తీరప్రాంతాలన్నింటికీ సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దాదాపు రెండు మీటర్ల ఎత్తున అలలు వచ్చి చిలీలోని పిసగువా పట్టణాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది చాలా విధ్వంసకంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. 2010 సంవత్సరంలో కూడా చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం, తర్వాత సునామీ రావడంతో అనేక పట్టణాలు చెల్లాచెదురైపోయాయి.