వాషింగ్టన్: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్‌కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీంతో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది (మెక్సికోలో భారీ భూకంపం)
చదవండి: 7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment