టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్‌లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో జపాన్ పశ్చిమ తీరంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
#Tsunami waves are flowing back up the river in Noto, Ishikawa japan#Japan #earthquakes #EarthwuakeInJapan pic.twitter.com/2MKF7u7U7i
— Ritesh Kumar (@riteshkumar1926) January 1, 2024
భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్‌లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు. హొకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు.
Store Owner records his store shake after 7.4 m earthquake hit Japan
— Hollow dreams (@ChrisKolen001) January 1, 2024
Tsunami warning is in Effect#Japan #tsunami #warning #deprem #sismo #地震 #earthquake #japanese #japannews pic.twitter.com/KJxlv0j1ii
మార్చి 11, 2011న, జపాన్‌లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్‌లో అణు అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: Happy New Year: 2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
Comments
Please login to add a commentAdd a comment