Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్‌లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR
— 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023
Comments
Please login to add a commentAdd a comment