Stunning: Meteor Lighting Up The Night Sky Over Chile, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Meteor Lights Up Chile Sky: ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?

Published Tue, Jul 12 2022 8:20 PM | Last Updated on Wed, Jul 13 2022 10:46 AM

Video Viral: Lighting Up The Night Sky Meteor Ignites Flash Chile - Sakshi

అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి.  ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు  భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement