lighiting
-
ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి. ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు. -
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పిడుగుల నుంచి రక్షణ పొందండి
వర్షాకాలం ప్రారంభమవుతోందంటే ఒక్కపక్క సంతోషం..మరోపక్క భయం కూడా వెంటాడుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. నీటి వనరులు చేకూరుతాయి. అయితే అదే సమయంలో పడే పిడుగులు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటున్న సందర్భాలున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. పిడుగుల నుంచి తప్పించుకోవాలంటే వజ్రపాత్ యాప్ అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుందంటున్నారు. సాక్షి,రాజాం: వర్షా కాలంలో ఏదో ఒక చోట పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. పొలాల్లో ఉండే రైతులు, ప్రయాణాల్లో ఉండేవారు పిడుగుపాటుకు గురై మృత్యుఒడిలోకి చేరుతున్నారు. మూగజీవాలు కూడా పిడుగులబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఓ వైపు భారత ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్లకు టెక్ట్సు మెసేజ్‌లు పెడుతున్నా, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రమాదాలు తప్పడంలేదు. ఇలాంటి ఘటనల నుంచి గట్టెక్కాలంటే అరచేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారందరూ వజ్రాయాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏడాదికి 120 మందికిపైగా మృతి ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు 120 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పదుల సంఖ్యలో జీవాలు కూడా చనిపోతున్నాయి. రైతులే ఎక్కువ మంది పిడుగుపాటుకు గురౌతున్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారికి ప్రకృతి వైపరీత్యాల విభాగంలో రూ. 4 లక్షల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యం సంభవిస్తే రూ. 59 వేలు, 60 శాతం అంగవైకల్యం దాటితే రూ. 2 లక్షలు నష్టపరిహారం అందించాలి. అయితే సాయం అందడంలో ప్రస్తు తం జాప్యం జరుగుతుంది. వైఎస్సార్ బీమాలో ఉన్నవారికి మాత్రమే పరిహారం అందుతుంది. జాగ్రత్తలు తప్పనిసరి ►పిడుగు పడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ►వర్షం, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదు. ►సురక్షిత ప్రాంతాలు వైపు వెళ్లిపోవాలి. ►పెద్దగా వచ్చే ఉరుముల శబ్దం వినబడగానే రెండు చెవులు మూసుకొని మొకాళ్లపై నిల్చోవాలి. ►పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ప్రాథమికి చికిత్సలో భాగంగా సంఘటనా స్థలం నుంచి తీసుకొచ్చి ఊపిరి అందించే ఏర్పాటు చేయాలి. ►చేతులు, కాలిని గట్టిగా చేతులతో రాపిడి చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. ►వర్షం పడే సమయంలో మూగజీవాలను సురక్షితమైన షెడ్లలో మాత్రమే ఉంచాలి. వజ్రపాత్ యాప్ యాప్ డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారంతా ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే భాష అడుగుతుంది. అనంతరం మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ నంబర్ ఆధారంగా లొకేషన్‌ను చూపించి ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులతో కూడిన వలయాలు వస్తాయి. ఈ వలయాలులో అంకెలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఎంత సేపట్లో పిడుగుపడే అవకాశం ఉందో సమాచారం వస్తోంది. సురక్షిత ప్రాంతాన్ని చూపిస్తుంది. పిడుగులు పడే ప్రమాదం లేకుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా మరో వైపు ఉన్న ఆప్షన్లో పిడుగు ఎప్పుడు పడుతుందో అనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది. -
ధన్‌తేరస్‌కు నాణేల మెరుపులు..
న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లకు శుభప్రదమైన దినంగా భావించే.. ధన్‌తేరస్‌లో వినియోగదారులు పసిడి, వెండి నాణేల కొనుగోళ్లకు అధికంగా మొగ్గుచూపారు. ఆభరణాల కొనుగోళ్లు మందగించాయి. ఆశోకచక్రతో కూడిన నాణేలుసహా పసిడి, వెండి నాణేల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా భారీగా ఉన్నట్లు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా, ఆభరణాల వర్తకులు తెలిపారు. 10 గ్రాముల వరకూ డిమాండ్ ‘10 గ్రాముల వరకూ పసిడి, వెండి నాణాలకు డిమాండ్ కనబడింది. గత ధన్‌తేరస్‌తో పోల్చి 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తక్కువగా ఉన్నా, ఆభరణాల డిమాండ్ భారీగా కనిపించలేదు’ అని బొంబాయి బులియన్ అసోసియేషన్, మాజీ ప్రెసిడెంట్ సురేష్ హూండియా పేర్కొన్నారు. పసిడి, వెండి నాణేలకే అధిక డిమాండ్ కనపడిందని జీజేఎఫ్ చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. మొత్తంగా గత ఏడాది తరహాలోనే ఇంచుమించు కొనుగోళ్ల పరిమాణం ఉంది. తక్కువ ధర ఉండడం కొనుగోళ్లకు ఊపునిచ్చిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ధరల ధోరణి ఇదీ... బొంబాయి బులియన్ స్పాట్ మార్కెట్లో పసిడి ధర 24, 22 క్యారెట్ల ధరలు సోమవారం వరుసగా... రూ.25,950, రూ.25,800గా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీ రూ.35,980 పలికింది. ఇంకా తగ్గుతుందనే... 10 గ్రాముల పసిడి ధర రూ.22,000 వరకూ పడిపోతుందన్న ఊహాగానం వల్ల భారీ ఆభరణాలకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వెరసి పసిడి ఆభరణాల డిమాండ్ 30 శాతం వరకూ పడిపోతుందని భావిస్తున్నా. ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ను నాణాల డిమాండ్ ఈ దఫా దాటిపోయింది. - సంతోష్ శ్రీవాస్తవ, ఎండీ, సన్వీ జ్యూవెల్స్ అశోకచక్ర నాణేలకు డిమాండ్.. పర్వదినం సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ భారీగా ఉంది. అయితే ఆభరణాలకన్నా... పసిడి, వెండి నాణేలకు డిమాండ్ బాగా కనిపించింది. గత ఏడాది ధన్‌తేరస్‌తో పోల్చితే 25 శాతం పసిడి నాణేల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. వెండి నాణేల అమ్మకాలు రెట్టింపు కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 5వ తేదీన ఆవిష్కరించిన అశోకచక్ర నాణేలకు కూడా డిమాండ్ భారీగా ఉంది. నిజానికి గడచిన కొన్ని రోజుల నుంచే పసిడి, వెండి నాణేలకు డిమాండ్ ఉంది. భారీగా తగ్గిన ధరలే దీనికి కారణం. - విపిన్ రైనా, ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రెసిడెంట్ (మార్కెటింగ్)