చిలీ ఉద్యోగులకు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శుభవార్త చెప్పారు. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.
2017లో నాటి చిలీ ప్రభుత్వం ఐదేళ్లలోపు వీక్లీ వర్కింగ్ అవర్స్‌ను 45 నుండి 40 గంటలకు తగ్గించాలని అప్పటి చట్ట సభ సభ్యులు, ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ ఆ బిల్లు అమలులో కార్యరూపం దాల్చలేదు.
అయితే ఈ తరుణంలో ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ 'అత‍్యవసర' బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. చిలీ రాజ్యాంగ నిబంధన ప్రకారం..దేశ ప్రెసిడెంట్ ఏదైనా బిల్లు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చట్టసభ సభ్యులు సైతం ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుంది. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
తప్పదు మరి
చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా చిలీ ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మహమ్మారి తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు చిలీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ తగ్గించే అంశంపై ఆ దేశానికి చెందిన సంస్థల ప్రతినిధులతో పాటు యూనియన్ సంఘాలు,వర్కర్ ఫెడరేషన్‌లతో సంప్రదింపులు జరుపుతుంది. చర్చలు కొనసాగుతుండగా.. తమ ప్రభుత్వం వర్కింగ్ అవర్స్‌ను తగ్గించే బిల్లును వెంటనే అమలు చేసేలా ఉభయ సభల సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ చెప్పారు.
చదవండి👉 వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే!
Comments
Please login to add a commentAdd a comment