weekly holiday
-
బ్యాంక్ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని! ఎప్పటినుంచంటే
వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది. ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్మెంట్ ప్రకారం,ఆర్బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్‌బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. -
ఉద్యోగులకు పండగే: వావ్..ఆ దేశంలో తగ్గనున్న పని గంటలు!
చిలీ ఉద్యోగులకు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శుభవార్త చెప్పారు. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో నాటి చిలీ ప్రభుత్వం ఐదేళ్లలోపు వీక్లీ వర్కింగ్ అవర్స్‌ను 45 నుండి 40 గంటలకు తగ్గించాలని అప్పటి చట్ట సభ సభ్యులు, ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ ఆ బిల్లు అమలులో కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ 'అత్యవసర' బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. చిలీ రాజ్యాంగ నిబంధన ప్రకారం..దేశ ప్రెసిడెంట్ ఏదైనా బిల్లు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చట్టసభ సభ్యులు సైతం ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుంది. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తప్పదు మరి చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా చిలీ ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మహమ్మారి తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు చిలీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ తగ్గించే అంశంపై ఆ దేశానికి చెందిన సంస్థల ప్రతినిధులతో పాటు యూనియన్ సంఘాలు,వర్కర్ ఫెడరేషన్లతో సంప్రదింపులు జరుపుతుంది. చర్చలు కొనసాగుతుండగా.. తమ ప్రభుత్వం వర్కింగ్ అవర్స్‌ను తగ్గించే బిల్లును వెంటనే అమలు చేసేలా ఉభయ సభల సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ చెప్పారు. చదవండి👉 వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే! -
పోలీసులకు వారాంతపు సెలవు!
త్వరలో అమలుకు ప్రభుత్వం యోచన ఆదిలాబాద్ క్రైం : సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పోలీసుల వారంతపు సెలవుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ జిల్లాలో త్వరలో అమలుకానుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ విధానం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన జిల్లాలో కూడా అమల్లోకి వచ్చిన వెంటనే ఏఏ పోలీసు స్టేషన్లలో ఎవరెవరికీ ఏఏ రోజు వారంతపు సెలవు ఇవ్వాలనే దాని పై పట్టిక తయారు చేస్తారు. త్వరలో జిల్లా లో వారంతపు సెలవు అమలులోకి తెస్తామని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విధానం హోంగా ర్డు, కానిస్టేబుళ్లకు వర్తించనుందా? లేక ఏ ఎస్సై స్థాయి వరకు వర్తిస్తుందా? అనేది తేల్చాల్సి ఉంది. ఇదిలా ఉంటే కానిస్టే బుల్ నుంచి ఏఎస్సై వరకు వారాంతపు సెలవు ఇవ్వాలని జిల్లా పోలీసు అధి కారుల సంఘం నాయకులు ఇప్పటికే జిల్లా ఎస్పీకి విన్నవించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే జిల్లాలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చి.. వారాం తపు సెలవులు అమలు చేయాలని పోలీసుల కుటుంబాలు కోరుతున్నాయి. సమస్యలతో సతమతం పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. శారీరకంగా అలసిపోతున్న పోలీసులకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటు రోగాలు, అటు ఒత్తిళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. పోలీసులు సరైన సమయంలో భోజనం, నిద్ర లేకపోవడంతో షుగర్వ్యాధి భారిన పడుతున్నారు. వీటితోపాటు ఎంతో మంది గుండెజబ్బు, మూత్రపిండాలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సయమానికి సెలవులు లేక.. కుటుంబాలకు దూరంగా ఉండలేక.. వెను వెంటనే డ్యూటీలు చేయడం.. ద్వారా మానసికంగా కుంగిపోతున్నారు. ఇక ఎన్నికల సమయంలో.. సభలు నిర్వహించే సమయంలో వీరి కష్టాలు చెప్పనక్కర్లేదు. ఏఎస్సై స్థాయి వరకు ఇవ్వాలి.. పోచలింగం నేత, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేసేందుకు కృషి చే యాలి. మన జిల్లాలోని కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సై స్థాయి వరకు వారాంతపు సెలవులు ఇవ్వాలని జిల్లా ఎస్పీ భూపాల్‌కు ఇప్పటికే వినతి పత్రం అందజేశాం. ఈ విధానంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా అమలు చేయాలి.