
చిలీలో భారీ భూకంపం
శాండియాగో: చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.3గా నమోదైంది. సముద్రంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
వాల్పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ సైరన్ మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో తీర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.