చిలీలో భారీ భూకంపంవల్ల తొలి మరణాన్ని అధికారులు ధృవీకరించారు.
శాండియాగో: చిలీలో భారీ భూకంపంవల్ల తొలి మరణాన్ని అధికారులు ధృవీకరించారు. తీరం వెంబడి ఉన్న రాజధాని ప్రాంతంలో పలు భవనాలు భూకంపం వల్ల తలెత్తిన సునామీ బారిన పడ్డాయని, ప్రస్తుతానికి స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించినట్లు అధికారులు తెలియజేశారు.
ప్రకంపనలు మాత్రం వెన్నులో వణుకుపుట్టించాయని, పక్క దేశాలైన బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనాలకు కూడా వాటి ప్రభావం కనిపించిందని చెప్పారు. ప్రస్తుతానికి వరదలు పోటెత్తాయని, వీధుల్లో కూడా పారుతున్నాయని వివరించారు. 2010లో వచ్చిన సునామీ తర్వాత అంతటి భారీ స్థాయి సునామీ వస్తుందని ఒక్కసారిగా భయపడినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఐదుగురు వరకు మరణించి ఉండొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.