
శాన్ జోస్ : కోస్టారికా దేశం జానాకాస్ట్ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్‌నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్‌లోని పుంటా ఇస్‌లిటా ఎయిర్ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్ జోస్‌కు బయలుదేరింది.
10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్ రివేరా సంతాపం తెలిపారు. మృతులకు సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment