
శాన్‌జోస్: ఒకే ఇంజిన్ ఉన్న సెస్నా విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లతో పాటు 10 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోస్టారికాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. పుత్నాఇస్లిట నుంచి శాన్‌జోస్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరిన సెస్నా విమానం గ్వాన్‌క్యాస్ట్‌లోని అటవీప్రాంతంలో కూలిపోయిందని కోస్టారికా ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ చనిపోయినట్లు వెల్లడించింది. మంటల్లో కాలిపోతున్న విమాన శకలాల వీడియోను, ఫొటోల్ని విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతులకు సంబంధించి ‘నేచుర్ ఎయిర్’ విమానయాన సంస్థ అందించిన వివరాలు మాత్రమే తమవద్ద ఉన్నారనీ.. వీటి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు కోస్టారికా ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment