FIFA World Cup 2022: జ‌పాన్‌కు షాకిచ్చిన‌ కోస్టారికా  | FIFA World Cup 2022: Costa Rica Defeat Japan | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2022: జ‌పాన్‌కు షాకిచ్చిన కోస్టారికా 

Published Sun, Nov 27 2022 7:37 PM | Last Updated on Sun, Nov 27 2022 7:38 PM

FIFA World Cup 2022: Costa Rica Defeat Japan - Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారతకాలమానం ప్రకారం ఇవాళ (నవంబర్‌ 27) మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మద్‌ అలీ బిన్‌ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ జపాన్‌, 31 ర్యాంకర్‌ కోస్టారికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోస్టారికా.. తమ కంటే పటిష్టమైన జపాన్‌కు షాకిచ్చి (1-0) వరల్డ్‌కప్‌-2022లో బోణీ విజయం సాధించింది.

రెండో అర్ధభాగం 81వ నిమిషంలో కీషర్‌ ఫుల్లర్‌ గోల్‌ కొట్టి కోస్టారికాను ఆధిక్యంలోకి తీసుకుకెళ్లాడు. అనంతరం జపాన్‌ ఎంత ప్రయత్నించినప్పటికీ.. గోల్‌ చేయలేక ఓటమిపాలైంది. ఈ గెలుపుతో కోస్టారికా గ్రూప్‌-ఈలో మూడో స్థానానికి ఎగబాకింది. 

ఇదిలా ఉంటే, మెగా టోర్నీలో నవంబర్‌ 23న జరిగిన మ్యాచ్‌లో జపాన్‌.. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీపై 2-1 తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే రోజు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోస్టారికా 0-7 గోల్స్‌ తేడాతో ఓటమిపాలై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement