బరువు తగ్గించుకోవడంకోసం ఉపవాసాలు, వ్యాయామాలు అంటూ ఊబకాయులు చాలా కష్టపడుతుంటారు. అయితే కోస్టా రికాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో బరువు తగ్గాడు. 21 రోజుల్లో కేవలం నీరు మాత్రమే తాగి 13.1 కిలోల దాకా బరువు తగ్గాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిస్ మిల్లర్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తన వాటర్ఫాస్టింగ్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. కోస్టా రికాలో 21 రోజుల పాటు నీటి ఉపవాసం (ఎలాంటి ఆహారం, ఉప్పు లేకుండానే) పాటించి 13.1 కేజీల బరువు తగ్గాడట. 6శాతం కొవ్వు తగ్గిందని అడిస్ వెల్లడించాడు. ఇప్పటికే సన్నగా ఉన్న మనిషి మరింత సన్నగా మారాడు. అయితే ఇది అందరూ ఆచరించవచ్చా? దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?
నీటి ఉపవాసం సురక్షితమేనా?
“నీటి ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. 24 గంటలమొదలు, కొన్ని రోజులు లేదా వారాల వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ ,మెరుగైన మానసిక స్పష్టత, దీర్ఘాయువుతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. .నీటి ఉపవాసం సమయంలో, శరీరం కాలేయం , కండరాల కణజాలంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్‌తో సహా నిల్వలపై ఆధారపడుతుంది.
నిపుణుల సమక్షంలో మాత్రమే
అయితేఇది అంత సురక్షితం కాదనీ, సరైన వైద్య నిపుణుల సమక్షంలో మాత్రమే చెప్పాలని చెపుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
నీటి ఉపవాసం ప్రమాదాలు:
పోషకాహార లోపాలు: విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపం ఏర్పడుడుతంది. ఫలితంగా బలహీనత, మైకం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
హైడ్రేషన్‌కు నీరు చాలా అవసరం అయితే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.
జీవక్రియపై ప్రభావం : సుదీర్ఘ ఉపవాసం జీవక్రియను నెమ్మదిస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది.
మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు నీటి ఉపవాసం జోలికి వెళ్లకుండా ఉండాలి. లేదా నిపుణులైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
నీటి ఉపవాసానికి ప్రత్యామ్నాయం
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ లేదా అడపాదడపా ఉపవాసాలను ఎంచుకోవచ్చు. ఎంత బరువు ఉండాలి అనేది నిర్ధారించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం బరువు తగ్గాలి. నిరంతర వ్యాయామం, జీవనశైలి మార్పులు, పిండి పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు, చక్కని పోషకాహారం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment