నటి నిమ్రా ఖాన్ క్రాష్ డైట్‌: ఇది ఆరోగ్యకరమేనా...? | Pakistani Actor Nimra Khan Crash Diet: Just 7 Days She Lost 8Kg | Sakshi
Sakshi News home page

జస్ట్‌ ఏడు రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గిన నటి నిమ్రా ఖాన్‌: ఇది ఆరోగ్యకరమేనా..?

Published Tue, Dec 17 2024 5:03 PM | Last Updated on Tue, Dec 17 2024 5:12 PM

Pakistani Actor Nimra Khan Crash Diet: Just 7 Days She Lost 8Kg

34 ఏళ్ల పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్‌ హాస్య ధారావాహిక కిస్ దిన్ మేరా వియా హొవేగాలో చిన్న పాత్రతో యాక్టింగ్‌ వృత్తిని ప్రారంభించింది. అలా నెమ్మదిగా మెహెర్బాన్, ఉరాన్, ఖూబ్ సీరత్, మే జీనా చాహ్తీ హూన్ వంటి ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఇటీవల చాలా తక్కువ వ్యవధిలో స్లిమ్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది.  తాను ఇంతలా బరువు ఎలా తగ్గిందో కూడా వివరించింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఇలా.. వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతులు మంచివేనా..? అనే సందేహం మెదిలింది. అయితే ఈ విధానంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.

పాక్‌ నటి ఇమ్రా ఖాన్‌ తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకుంది. తాను క్రాస్‌డైట్‌తో కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు తెలిపింది. అలాగే తాను ఈ డైట్‌ని ఎలా ఫాలో అయ్యిందో కూడా వివరించింది. బరువు తగ్గడానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే గాక నిబద్ధతతో డైట్‌ ఫాలో కావాలని చెప్పుకొచ్చింది. తాను ఆహారంలో కేవలం తెల్లసొన, యాపిల్స్‌, గ్రీన్‌ టీ, వెజిటబుల్‌ జ్యూస్‌లు మాత్రమే తీసుకుని, పూర్తిగా కార్బోహైడ్రేట్‌లను నివారించానని తెలిపింది. 

ఇలా.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే దినచర్య అని పేర్కొంది. అందువల్లే కేవలం ఏడు రోజుల్లోనే ఎనిమిది కిలోలు బరువు తగ్గినట్లు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తేనె, నిమ్మకాయ, చియా గింజలు కలిపిన గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ ప్రారంభించాలని చెప్పింది. అయితే ఇది ఏడు రోజుల డైట్‌ ప్లాన్‌ అని..చాలావరకు అందరూ మూడు రోజులు స్ట్రిట్‌గా ఫాలోఅయ్యి, ఆ తర్వాత మధ్యలోనే స్కిప్‌ చేసేస్తుంటడంతో మంచి ఫలితాలు పొందలేకపోతుంటారని చెప్పుకొచ్చింది.  

బరువు తగ్గడానికి ఇది సరైనదేనా..?
నటి నిమ్రా డైట్‌ ప్లాన్‌​ త్వరితగతిన ఫలితాలు ఇచ్చినప్పటికీ.. బరువు నిర్వహణకు ఇది సరైన ఆరోగ్య విధానం కాదని చెబుతున్నారు నిపుణుల. ఇలాంటి క్రాష్‌ డైట్‌లు తరుచుగా కొవ్వు తగ్గడం కంటే..శరీరంలోని నీటి శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో హర్మోన్ల అసమతుల్యత, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలనకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

అలాగే ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్‌ ఆహారంలో చేర్చే ప్రయత్నం చేస్తే.. విపరీతమైన బరువు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా హర్మోన్ల మార్పులు, పిత్తాశయ రాళ్లు, మానసిక కల్లోలం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. మంచి ఫలితాల కోసం నిధానంగా బరువు తగ్గించే ఆరోగ్యకరమైన వెయిట్‌ లాస్‌ డైట్‌లు మంచివని అన్నారు. వీటితో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడమే గాక ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రోగ నిరోధకశక్తి  వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు.

(చదవండి: బ్రెస్ట్‌ కేన్సర్‌: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement