బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..?
పోషకాహార లోపాలు
వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్‌లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది.
జుట్టు రాలడం
శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు.
కండరాల నష్టం
క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
స్లో మెటబాలిజం
బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది.
డీహైడ్రేషన్
బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు.
ఇతర సమస్యలు..
- శక్తి తగ్గడం
- పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం
- విపరీతమైన అలసట
- రోగనిరోధక వ్యవస్థ
- బోలు ఎముకల వ్యాధి
- తలనొప్పి
- చిరాకు
- మలబద్ధకం
ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: డైట్‌లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!)
Comments
Please login to add a commentAdd a comment