Ranadeep Hooda
-
మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
ఒక్క ట్వీట్‌తో ఊహించని స్పందన
బెంగళూరు: మంచో, చెడో ఏదో ఒక రెస్పాన్స్ త్వరాగా రావాలంటే సోషల్ మీడియానే సరైన వేదిక. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కొకొల్లలు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన బాబా కా దాబా కథనానికి ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యక్షంగా చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. పాపం ఎండలో రోడ్డు మీద కూర్చుని మొక్కలు అమ్ముకుంటున్న వృద్ధుడికి సాయం చేయాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు, సిని ప్రముఖులను కూడా కదిలించింది. ఎండకు రోడ్డు మీద కూర్చున్న ఆ వ్యక్తి కోసం నెటిజనులు గొడుగు, టేబుల్, కుర్చి వంటివి ఏర్పాటు చేయడమే కాక అతడి దగ్గర మొక్కలు కొని మద్దతుగా నిలిస్తున్నారు. (చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) Meet Revana Siddappa, an old man, who sells plants at Kanakapura road near Sarakki Signal, Karnataka. Price of these plants are from Rs 10-30 On one hand he hold umbrella to save himself from sunlight Plz support this man.@ParveenKaswan @ActorMadhavan @KanchanGupta @SonuSood pic.twitter.com/xRhqZEcG1r — IMShubham (@shubham_jain999) October 26, 2020 వివరాలు.. ట్విట్టర్ యూజర్ శుభమ్ జైన్999 అనే వ్యక్తి ఈ వృద్ధుడి గురించి ట్వీట్ చేశాడు. ‘కర్ణాటక సరక్కి సిగ్నల్ కనకపురి రోడ్డులో రేవన సిద్దప్ప అనే వ్యక్తి మొక్కలు అమ్ముకుంటున్నాడు. ఒక్కొ మొక్క ధర 10-30 రూపాయలు మాత్రమే. అతనికి సాయం చేయండి’ అంటూ వృద్ధుడికి సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశాడు. తక్కువ సమయంలోనే ఈ ట్వీట్ వేలాది లైక్స్ సంపాదించింది. నటుడు రణదీప్ హుడాని కూడా ఆకర్షించింది. దాంతో కరెక్ట్ అడ్రెస్ చెప్పాల్సిందిగా హుడా, శుభమ్ జైన్‌ని కోరాడు. అనంతరం సిద్దప్ప కరెక్ట్ అడ్రెస్‌ని ట్వీట్ చేస్తూ.. హే బెంగళూరు.. కొంత ప్రేమను చూపించు అంటూ వృద్ధుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా తన అనుచరులను కోరారు రణదీప్ హుడా. అలానే నటుడు మాధవన్, ఆర్జే అలోక్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేశారు. Hey Bangalore .. do show some love .. he sits in front of Wular Fashion factory, JP Nagar, Sarakki Signal, Kanakapura Road, Bangalore. https://t.co/rBFyQcbZAb — Randeep Hooda (@RandeepHooda) October 26, 2020 దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. చేంజ్ మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్ అనే ఎన్జీఓ సంస్థ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాఖ్య సిద్దప్పకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడి కోసం ఓ గొడుకు, టేబుల్, కుర్జీతో పాటు అమ్మడానికి మరిన్ని మొక్కలు అందిచారు. -
ఐశ్వర్య రెండో ప్రయత్నం కూడా ఆకట్టుకోలేదు
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. నిజజీవిత కథల ఆదారంగా తెరకెక్కిన సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే బాటలో ఇటీవల విడుదలైన ఎయిర్ లిఫ్ట్, నీర్జా లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో మరో బయోపిక్ వెండితెర మీదకు వచ్చింది. అయితే ఎలాంటి సెలబ్రిటీ స్టేటస్ లేకపోయినా అన్యాయంగా పాకిస్థాన్ జైలులో ప్రాణాలు కోల్పోయిన ఓ సామాన్యుడి కథను సరబ్జీత్ పేరుతో వెండితెర మీద ఆవిష్కరించారు. తన అన్న విడుదల కోసం 23 ఏళ్ల పాటు పోరాటం చేసే సోదరి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. జెబ్జా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఐష్, ఆ సినిమాతో నిరాశపరిచినా సరబ్జీత్ ఆకట్టుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులో భిఖివిండ్ గ్రామంలో నివసించే సాధారణ రైతు సరబ్జీత్ సింగ్. అంతా ప్రశాతంగా సాగుతున్నా రైతు జీవితంలో జరిగిన ఓ సంఘటన అతన్ని తన కుటుంబానికీ, దేశానికీ దూరం చేసింది. అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సరబ్‌జీత్‌ను లాహోర్ బాంబు పేలుళ్ల నిందితుడిగా పేర్కొంటూ పాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఈ విషయం తెలిసి సరబ్జీత్ సోదరి దల్బీర్‌కౌర్, తన అన్నను నిర్దోషిగా నిరూపించేందుకు ఏకంగా 23 ఏళ్ల పాటు పోరాటం చేస్తుంది. తన ప్రయత్నాలు కొనసాగుతుండగానే.., ఓ రోజు జైలులో ఖైదీల దాడిలో సరబ్జీత్ చనిపోతాడు. సరబ్ జీత్ మరణం తరువాత దల్బీర్ ఏం చేసింది.? తన అన్నను నిర్ధోషిగా నిరూపించిందా లేదా అన్నదే సరబ్ జీత్ కథ. ఎన్నో అంచనాల మధ్య ఓమాంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సరబ్జీత్ అంచనాలను అందుకోవటంలో తడబడింది. ఎలాంటి తప్పు చేయకపోయినా 23 ఏళ్ల పాటు పాకిస్థాన్ జైలులో ఉండి, అక్కడే మరణించిన వ్యక్తి జీవితంపై.., సినిమా అనగానే ప్రేక్షకుల్లో అతని కథ తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. అయితే కథ మీద కన్నా ఎక్కువగా ఎమోషన్స్‌ను చూపించటం మీదే దర్శకుడు దృష్టి పెట్టాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమాలో కావాలని పాటలు ఇరికించటం కూడా కాస్త ఇబ్బంది కలిగించింది. ఐశ్వర్యా రాయ్ , రణదీప్ హుడాలు సాంకేతికంగా జరిగిన తప్పులను తమ నటనతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. యువతిగా మధ్య వయస్కురాలిగా నటించిన ఐష్ రెండు వేరియేషన్స్‌ను అద్భుతంగా చూపించింది. ఇక సరబ్ జీత్ పాత్రలో రణదీప్ హుడా ఒదిగిపోయాడు. ఇలా నటన పరంగా ఆకట్టుకున్న సాంకేతికంగా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఐశ్వర్య రీ ఎంట్రీలో రెండో ప్రయత్నంలో కూడా ఆకట్టుకోలేకపోయింది. -
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది
సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ బాట పట్టిన కాజల్ అగర్వాల్ అనుకున్న స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. అజయ్ దేవగణ్ సరసన నటించిన సింగంతో పాటు, అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన స్పెషల్ 26 సినిమాలు మంచి సక్సెస్‌లు సాధించినా హీరోయిన్గా కాజల్‌కు మాత్రం క్రేజ్ రాలేదు. దీంతో ఇక బాలీవుడ్ తనకు సెట్ కాదనుకున్న ఈ భామ తిరిగి సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది. తాజాగా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది కాజల్. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రణదీప్ హుడా సరసన దో లఫ్జోంకి కహానిలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ బాజీరావ్ మస్తానీతో పాటు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాతో అయినా కాజల్ బాలీవుడ్ ఆశలు నెరవేరతాయేమో చూడాలి. -
'మై ఔర్ చార్లెస్' మూవీ రివ్యూ
టైటిల్: మై ఔర్ చార్లెస్ జానర్: బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ తారాగణం: రణదీప్ హుడా, ఆదిల్ హుసెన్, రిచా చడ్డా, టిస్కా చోప్రా దర్శకుడు: ప్రవాల్ రమణ్ నిర్మాత : రాజు చడ్డా, అమిత్ కపూర్, విక్రమ్ కక్కర్ ఇటీవలి కాలంలో బాలీవుడ్ స్క్రీన్ మీద బయోగ్రాఫికల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సినీ తారలు, క్రీడాకారుల జీవితాలు మాత్రమే తెరకెక్కాయి. 'మై ఔర్ చార్లెస్' సినిమాతో తొలిసారిగా ఓ నేరస్థుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు. ఇండియన్ క్రైం హిస్టరీలో అత్యంత తెలివైన నేరస్థుడిగా పేరు తెచ్చుకున్నచార్లెస్ శోభరాజ్ జీవితగాధతో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ బయోగ్రాఫికల్ మూవీ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.. కథ: సినిమా కథ అంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. చార్లెస్ జీవితంలోని వ్యక్తులు వాళ్లతో అతనికి ఉన్న సంబంధం, అతడు చేసిన నేరాలు, అందుకు కారణాలు, ఇలా సినిమా అంతా ఓ నవలలా సాగుతుంది. చార్లెస్ శోభరాజ్ కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఆమోద్ కాంత్ చార్లెస్ జీవితంలోని విశేషాలు వివరిస్తున్నట్టు స్క్రీన్‌ప్లేను నడిపించాడు దర్శకుడు. విశ్లేషణ : ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ రణదీప్ హుడా. లుక్, బాడీలాంగ్వేజ్ లాంటి విషయాల్లో ఎంతో రీసెర్చ్ చేసి ఈ క్యారెక్టర్ చేసినట్టుగా అనిపిస్తోంది. క్రూరమైన ఆలోచనలు ఉన్న ఓ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు రణదీప్ హుడా. ఇక దర్శకుడు రమణ్ కూడా సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాడు. ప్రేక్షకులను 1960లలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఏ ఒక్క సీన్లోనూ కథ మీద పట్టు కోల్పోకుండా అద్భుతంగా నడిపించాడు. ముఖ్యంగా కథ నడిపించటం కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథనం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. అయితే చార్లెస్‌ను అత్యంత తెలివైన కిల్లర్‌గా చూపించే ప్రయత్నంలో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యాడు దర్శకుడు. ఇతర పాత్రలలో నటించిన రిచా చడ్డా, ఆదిల్ హుసెన్, టిస్కా చోప్రాలు పరవాలేదనిపించారు. ఓవరాల్‌గా మై ఔర్ చార్లెస్ ఒక్కసారి చూడదగ్గ బయోగ్రఫికల్ క్రైం థ్రిల్లర్