మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది | Kajal Bollywood re entry with Do lafjonki Khani | Sakshi
Sakshi News home page

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది

Published Wed, Dec 16 2015 2:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది - Sakshi

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది

సౌత్లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ బాట పట్టిన కాజల్ అగర్వాల్ అనుకున్న స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. అజయ్ దేవగణ్‌ సరసన నటించిన సింగంతో పాటు, అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన స్పెషల్ 26 సినిమాలు మంచి సక్సెస్లు సాధించినా హీరోయిన్గా కాజల్కు మాత్రం క్రేజ్ రాలేదు. దీంతో ఇక బాలీవుడ్ తనకు సెట్ కాదనుకున్న ఈ భామ తిరిగి సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది.

తాజాగా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది కాజల్. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రణదీప్ హుడా సరసన దో లఫ్జోంకి కహానిలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ను బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ బాజీరావ్ మస్తానీతో పాటు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాతో అయినా కాజల్ బాలీవుడ్ ఆశలు నెరవేరతాయేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement