Water fasting
-
Water Fasting : 21 రోజుల్లో 13 కిలోలు తగ్గాడు! ఇది సురక్షితమేనా?
బరువు తగ్గించుకోవడంకోసం ఉపవాసాలు, వ్యాయామాలు అంటూ ఊబకాయులు చాలా కష్టపడుతుంటారు. అయితే కోస్టా రికాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో బరువు తగ్గాడు. 21 రోజుల్లో కేవలం నీరు మాత్రమే తాగి 13.1 కిలోల దాకా బరువు తగ్గాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిస్ మిల్లర్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తన వాటర్ఫాస్టింగ్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. కోస్టా రికాలో 21 రోజుల పాటు నీటి ఉపవాసం (ఎలాంటి ఆహారం, ఉప్పు లేకుండానే) పాటించి 13.1 కేజీల బరువు తగ్గాడట. 6శాతం కొవ్వు తగ్గిందని అడిస్ వెల్లడించాడు. ఇప్పటికే సన్నగా ఉన్న మనిషి మరింత సన్నగా మారాడు. అయితే ఇది అందరూ ఆచరించవచ్చా? దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?నీటి ఉపవాసం సురక్షితమేనా?“నీటి ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. 24 గంటలమొదలు, కొన్ని రోజులు లేదా వారాల వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ ,మెరుగైన మానసిక స్పష్టత, దీర్ఘాయువుతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. .నీటి ఉపవాసం సమయంలో, శరీరం కాలేయం , కండరాల కణజాలంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్తో సహా నిల్వలపై ఆధారపడుతుంది.నిపుణుల సమక్షంలో మాత్రమేఅయితేఇది అంత సురక్షితం కాదనీ, సరైన వైద్య నిపుణుల సమక్షంలో మాత్రమే చెప్పాలని చెపుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. నీటి ఉపవాసం ప్రమాదాలు:పోషకాహార లోపాలు: విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపం ఏర్పడుడుతంది. ఫలితంగా బలహీనత, మైకం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.హైడ్రేషన్‌కు నీరు చాలా అవసరం అయితే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.జీవక్రియపై ప్రభావం : సుదీర్ఘ ఉపవాసం జీవక్రియను నెమ్మదిస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది.మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు నీటి ఉపవాసం జోలికి వెళ్లకుండా ఉండాలి. లేదా నిపుణులైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.నీటి ఉపవాసానికి ప్రత్యామ్నాయం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా అడపాదడపా ఉపవాసాలను ఎంచుకోవచ్చు. ఎంత బరువు ఉండాలి అనేది నిర్ధారించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం బరువు తగ్గాలి. నిరంతర వ్యాయామం, జీవనశైలి మార్పులు, పిండి పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు, చక్కని పోషకాహారం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం. -
తెలుగువారి భావోద్వేగాలకు అద్దంపట్టిన జలదీక్ష
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ అమృతలూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడ్రోజులుగా కర్నూలులో చేపట్టిన ‘జలదీక్ష’ తెలుగు ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నిలిచిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున చెప్పారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రను ఎడారిగా మార్చేలా ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరోధించడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో కేసీఆర్‌కు బానిసగా మారి తెలుగు వారి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదాపై నిలదీయలేక కేంద్రం వద్ద సాగిలపడి రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ రాష్ట్రాలో ప్రాజెక్టులు కడితే, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని, భావితరాల ప్రజల కోసం జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారతదేశంలో 27 దీక్షలు చేపట్టిన ఘనత తమ నాయకుడుకే దక్కుతుందని మేరుగ తె లిపారు. -
జలదీక్షకు ‘అనంత’ మద్దతు
కర్నూలు తరలిన నేతలు అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు సంఘీభావం తెలిపేందుకు ‘అనంత’ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, వ్యవసాయ, రైతు సంఘాల నాయకులు బుధవారం తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు బస్సులు, కార్లలో భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద గురునాథరెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా...ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లుండి చూడలేని గుడ్డివాడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదులపై అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులతో భవిష్యత్తులో రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు హయాంలోనే కృష్ణాజలాలపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించాయన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతోందన్నారు. అయినా ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిస్వార్థంగా దీక్ష చేస్తున్నారన్నారు. అందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం తెలిపేందుకు అన్ని వర్గాల వారూ కర్నూలుకు వెళ్తున్నారన్నారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో ఎక్కడ భయంతోనే సీఎం నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పురుషోత్తం, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనాగ్రహాన్ని చూసైనా బుద్ధి రాదా..
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి చేపట్టిన జల దీక్షకు లభిస్తున్న జనాధరణను చూసైనా టీడీపీ ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలుకు వెళ్తూ మంగళవారం ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో ఆరు జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన ప్రజలు ఉవ్వెత్తున తరలివచ్చి జగన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, డిండిలతోపాటు వివిధ ప్రాజెక్టులు చేపడితే కరువుతో తాము ఎల్లకాలం అల్లాడాల్సిందేనని భావిస్తున్న ప్రజలు, రైతులు జగన్ జలదీక్ష జయప్రదం కావాలని, అక్రమ ప్రాజెక్టులు నిలిచిపోవాలని కోరుతూ వేలాది మంది తరలివ స్తున్నారని చెప్పారు. ఇలాంటి జనాదరణ కలిగిన జగన్‌ను రోజూ మంత్రులచేత తిట్టిస్తూ ఏదో విధంగా ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు అసలు సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిలిపివేతకు చర్యలు తీసుకునే విధంగా అధికార పార్టీ వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. -
17న మండల కేంద్రాల్లో జలదీక్షలు
► కర్నూలులో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా... ► వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పిలుపు తిరుపతి మంగళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న జలదీక్షకు ఈ నెల 17వ తేదీన జిల్లాలోని అన్ని మండలకేంద్రా ల్లో దీక్షలు చేపట్టి మద్దతు ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మిస్తే గోదావరి నుంచి చుక్కనీరు కూడా ఆంధ్రా, రాయలసీమలకు రావని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించి జగనన్న ఈ నెల 16, 17, 18వ తేదీలలో జలదీక్ష చేపట్టనున్నారన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎదురు తిరిగితే ఓటుకు నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయం నెలకొందన్నారు. సీఎం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని మండిపడ్డారు. కనీసం సిగ్గు, శరం ఉంటే తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. జగనన్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. విజయవంతం చేద్దాం యూనివర్సిటీ క్యాంపస్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన జలదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విద్యార్థి విభాగం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం నూతనంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంవల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన చంద్రబాబునాయుడు అది నా బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం జగనన్న చేస్తున్న దీక్షకు విద్యార్థులు అండగా నిల వాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మురళీధర్, సురేష్‌నాయక్, కిషోర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, హేమంత్‌కుమార్‌రెడ్డి, సతీష్, సోమునాయక్ తదితరులు పాల్గొన్నారు.