వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడ్రోజులుగా కర్నూలులో చేపట్టిన ‘జలదీక్ష’ తెలుగు ప్రజల.....
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ
అమృతలూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడ్రోజులుగా కర్నూలులో చేపట్టిన ‘జలదీక్ష’ తెలుగు ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నిలిచిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున చెప్పారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రను ఎడారిగా మార్చేలా ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరోధించడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో కేసీఆర్‌కు బానిసగా మారి తెలుగు వారి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రత్యేక హోదాపై నిలదీయలేక కేంద్రం వద్ద సాగిలపడి రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ రాష్ట్రాలో ప్రాజెక్టులు కడితే, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని, భావితరాల ప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారతదేశంలో 27 దీక్షలు చేపట్టిన ఘనత తమ నాయకుడుకే దక్కుతుందని మేరుగ తె లిపారు.