17న మండల కేంద్రాల్లో జలదీక్షలు
► కర్నూలులో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా...
► వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పిలుపు
తిరుపతి మంగళం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న జలదీక్షకు ఈ నెల 17వ తేదీన జిల్లాలోని అన్ని మండలకేంద్రా ల్లో దీక్షలు చేపట్టి మద్దతు ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మిస్తే గోదావరి నుంచి చుక్కనీరు కూడా ఆంధ్రా, రాయలసీమలకు రావని తెలిపారు.
ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించి జగనన్న ఈ నెల 16, 17, 18వ తేదీలలో జలదీక్ష చేపట్టనున్నారన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎదురు తిరిగితే ఓటుకు నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయం నెలకొందన్నారు. సీఎం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని మండిపడ్డారు. కనీసం సిగ్గు, శరం ఉంటే తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. జగనన్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
విజయవంతం చేద్దాం
యూనివర్సిటీ క్యాంపస్: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన జలదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విద్యార్థి విభాగం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం నూతనంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంవల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
దీనిని అడ్డుకోవాల్సిన చంద్రబాబునాయుడు అది నా బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం జగనన్న చేస్తున్న దీక్షకు విద్యార్థులు అండగా నిల వాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మురళీధర్, సురేష్‌నాయక్, కిషోర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, హేమంత్‌కుమార్‌రెడ్డి, సతీష్, సోమునాయక్ తదితరులు పాల్గొన్నారు.