దోహా: అందివచ్చిన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోస్టారికా జట్టు ఆరోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. చివరి బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కోస్టారికా 1–0తో గెలిచింది. ఆట మూడో నిమిషంలో జోయల్ క్యాంప్‌బెల్ గోల్ చేసి కోస్టారికాను ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న కోస్టారికా జట్టు విజయంతోపాటు బెర్త్‌ను ఖరారు చేసుకొని వరుసగా మూడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది.
50 లక్షల జనాభా కలిగిన కోస్టారికా ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచకప్‌లో పాల్గొ ని 2014లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కోస్టారికా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ దశ ముగిసింది. ఈ ఏడాది ఖతర్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో మొత్తం 32 జట్లు బరిలో ఉన్నాయి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment