సెరావల్లె (సాన్ మరినో): రెండో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం 55 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ జట్టు వచ్చే ఏడాది ఖతర్‌లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరిగిన గ్రూప్ ‘ఐ’ పోరులో ఇంగ్లండ్ 10–0 గోల్స్ తేడాతో సాన్ మరినోపై ఘనవిజయం సాధించి ఈ మెగా ఈవెంట్‌కు 16వసారి అర్హత పొందింది.
26 పాయింట్లతో గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఇంగ్లండ్‌కు బెర్త్ దక్కింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హ్యారీ కేన్ నాలుగు గోల్స్‌తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ జట్టు 1966లో ఏకైకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment