న్యూయార్క్: భారత సంతతికి చెందిన 49 ఏళ్ల ఓ మహిళ షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కోస్టారికా పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్టారికాలోని కోకస్ ద్వీపంలో స్క్యూబా డైవింగ్ చేయడానికి 18 మంది వెళ్లారు. వీరంతా డైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్క్‌వచ్చి వారిపై దాడిచేసింది. వారిలో రోహినా భండారీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆమెకు చికిత్స అందించినా కాళ్లకు అయిన గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆమె మరణించారు. రోహినాతోపాటు స్కూబా డైవింగ్ మాస్టర్ కూడా షార్క్ వల్ల స్వల్ప గాయలపాలయ్యారు. అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. షార్క్ మామీద దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి షార్క్ నుంచి దూరంగా ప్రయాణించేందుకు ఎంత ప్రయత్నించినా అది వేగంగా వచ్చి దాడిచేసిందని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో భండారీ ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోకస్ ద్వీపం రకరకాల షార్క్ జాతులకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందడంతోపాటు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి కూడా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment