త్రిష
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. ఆ కళ కొందరికి తెలియదు. త్రిషకు మాత్రం బాగా తెలుసు. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేసేయడం, డైరీలో కాస్త ఖాళీ దొరికితే హాలీడే ప్లాన్ చేసుకోవడం.. ఫుల్లుగా ఎంజాయ్ చేయడం. ఇది త్రిష మంత్ర. ప్రతి సంవత్సరం లాంగ్ ట్రిప్, షార్ట్ ట్రిప్.. ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. వీలు కుదిరితే రెండు ట్రిప్స్ వెళతారు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్‌లో ఎక్కువగా వెళుతుంటారు. ఇప్పుడు త్రిష హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లారో తెలుసా? అమెరికాలోని కోస్టా రికాలో వాలిపోయారు. డిసెంబర్‌లో అక్కడి వాతావరణం చాలా బాగుంటుందట.
పచ్చని ప్రదేశాలు, డైట్ పట్టించుకోకుండా లాగించేసేలా రుచికరంగా వడ్డించే రెస్టారెంట్లు... ఇలా రిలాక్స్ అవ్వడానికి బోల్డంత స్కోప్ ఉన్న ప్లేస్ కూడా. అందుకే త్రిష ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇదిగో ఇక్కడ ఫొటోలో త్రిష ఎంత కూల్‌గా కనిపిస్తున్నారో చూశారా! కోస్టా రికాలో దిగిన ఫొటో ఇది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. త్రిష నటించిన తమిళ చిత్రం ‘96’ ఇటీవల విడుదలై, సూపర్ డూపర్ హిట్టయింది. ఆ ఆనందంలో ఉన్న త్రిషకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘పేట్టా’లో నటించే అవకాశం దక్కింది. దాంతో డబుల్ హ్యాపీ. ఇంకా తమిళంలో మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. కెరీర్ ఆరంభించి పదిహేనేళ్లయినప్పటికీ త్రిష కెరీర్ స్టడీగా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment