సాక్షి, ముంబై: వరుస రికార్డులకు స్టాక్‌మార్కెట్లు బ్రేక్ వేశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల కారణంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త రికార్డులను అందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ తరువాత నష్టాల్లోకి జారకున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు, అధిక స్థాయిల్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు క్షీణించి 37,522 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,346 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, మెటల్ బలహీన పడగా, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడ్డాయి. కోల్ ఇండియా, లుపిన్, ఇన్‌ఫ్రాటెల్, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. హిందాల్కో, ఐసీఐసీఐ, మారుతీ, వేదాంతా, టాటా స్టీల్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐషర్, బజాజ్ ఆటో నష్టాల్లోనూ ముగిశాయి. మరోవైపు రెపోరేటు పెంపు బ్యాంకింగ్ సెక్టార్‌ను ప్రభావితం చేయగా, జూలై గణాంకాల తరువాత ఆటో సెక్టార్ నష్టపోయినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.
మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో మంగళవారం రూ. 572 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 291 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 234 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా... దేశీ ఫండ్స్ నామమాత్రంగా రూ. 48 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment