సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఊత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించడంతో కీలక సూచీలు భారీ లాభాల వైపు దూసుకు పోతున్నాయి. ఒకదశలో 300 పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 278 పాయింట్ల లాభంతో 35,181వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 10,683 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ళ ధోరణి నెలకొంది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఓబీసీ, పీఎన్‌బీతోపాటు, ఎస్‌బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితరాలు లాభపడుతున్నాయి. వీటితోపాటు ఆటో రంగ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
కాగా మూడు రోజులపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ముడిచమురు ధరల పెరుగుదల, సీపీఐ బలపడుతుండటం వంటి ప్రతికూల అంశాల నడుమ పావు శాతం రెపో రేటు పెంపునకు ఓటు వేసింది. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. అలాగే రివర్స్ రెపోను సైతం 0.25 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment