![Mpc Meeting: Rbi Expected To Keep Rate Unchanged - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/2/rbi.jpg.webp?itok=6IxEeD0N)
రుణ గ్రస్తులు ఎంతో ఆతృగా ఎదురు చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అక్టోబర్ 4- 6 తేదిల్లో జరగనుంది. సాధారణంగా ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం అంటే ప్రధానంగా వడ్డీ రేట్లు పెంపు, తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరుగుతుంది.
అయితే మరో రెండ్రోజుల్లో జరిగే ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సమాచారం. 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో వివిధ దశల్లో ఆర్‌బీఐ రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత వరుసగా రెపో రేట్లను యథాతదంగా కొనసాగిస్తూ వచ్చింది.
దీంతో రిటైల్, గృహ, వాహన రుణాలు ప్రియమయ్యాయి. రుణ గ్రహీతలపై భారం పడింది. ఈ తరుణంలో వచ్చే సమీక్షాలోనూ ఆర్‌బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని రుణగ్రస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment