భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 వరకు జరగనుంది. బడ్జెట్ తర్వాత మొదటి సమావేశం కావడం, మరోవైపు సెప్టెంబరులో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలను సూచిస్తుండటంతో కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆర్బీఐ ఎంపీసీ గత సమావేశం జూన్‌లో జరిగింది. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలను చూసింది. అయితే ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలందరూ రేపటి ఆర్బీఐ ఎంపీసీ ఎనిమిదవ వరుస సమావేశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా రెపో రేటును 6.5% వద్దే ఉంచుతారని అంచనా వేస్తున్నారు.
ప్రధాన ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఒత్తిడి నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ జాగ్రత్తగా ఉండవచ్చని బార్క్లేస్‌లో ప్రాంతీయ ఆర్థికవేత్త శ్రేయా సోధాని ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. "4-2 మెజారిటీతో ద్రవ్య విధాన కమిటీ విధాన సెట్టింగ్‌లను మార్చకుండా ఉంచుఉంచుతుందని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు. స్థిరమైన వృద్ధి ఉండటం, ప్రస్తుతానికి రేట్లు తగ్గించడానికి అత్యవసరం లేకపోవడం వలన మొదటి రేటు తగ్గింపు డిసెంబర్ తర్వాతే ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment