ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ఇటీవలి పావుశాతం పెంపునకు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ఇరువురు ఇరువురు వ్యతిరేకించారు. గవర్నర్‌సహా నలుగురు పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు. ద్రవ్యోల్బణం భయాలతో ఈ నెల మొదట్లో రెపో పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.
ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ముగ్గురు ప్రభుత్వం నామినేట్ చేసిన– ఎక్స్‌టర్నర్ సభ్యులు –– శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు ఉన్నారు. వీరిలో వర్మ గోయల్‌లు ఇరువురూ రేటు పెంపును వ్యతిరేకించినట్లు బుధవారం వెలువరించిన మినిట్స్ తెలిపాయి.
ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తున్నందున, రేటు పెంపునకు బదులుగా వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని వీరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్‌లలో ఇది 6 శాతం దిగువకు చేరడం ఇరువురు సభ్యుల అభిప్రాయాల నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment